అనంతపురం జిల్లా తాడిమరి మండలం ఏకపాదం పల్లి వద్ద ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఐచర్ వాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
నార్పల మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన నాగరాజు మల్లెపూలను బత్తలపల్లి మార్కెట్లో విక్రయించేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురై మరణించాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:
విధుల్లో నిర్లక్ష్యం.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉద్యోగులపై వేటు