అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం దనియానిచెరువు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తనకల్లు మండలం చిన్నపల్లికి చెందిన శ్రీహరి నాయుడు, చలపతి నాయుడు ద్విచక్రవాహనంపై గాలివీడుకు బయలుదేరారు. ధనియాని చెరువు వద్ద వీరిని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన శ్రీహరి నాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడ్డ చలపతి నాయుడిని చికిత్సకోసం నంబుల పూలకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చూడండి...