ETV Bharat / state

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. ఏసీపీకి బెయిల్ - మల్కాజిగిరి ఏసీపీ నరసింహా రెడ్డికి బెయిల్​ హైదరాబాద్​

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన తెలంగాణలోని మల్కాజిగిరి ఏసీపీ నరసింహా రెడ్డికి షరతులతో కూడిన బెయిల్​ మంజూరైంది. అనిశా అధికారుల సోదాల్లో భారీ ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది. సెప్టెంబర్​ 23న నరసింహా రెడ్డిని అధికారులు అరెస్టు చేశారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. ఏసీపీకి బెయిల్

author img

By

Published : Nov 17, 2020, 11:03 PM IST

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన తెలంగాణలోని మల్కాజిగిరి ఏసీపీ నరసింహా రెడ్డికి బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్​ను అనిశా న్యాయస్థానం మంజూరు చేసింది. మల్కాజిగిరి ఏసీపీగా పనిచేసిన నరసింహా రెడ్డిపై సెప్టెంబర్ 23న అనిశా అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో చంచల్​గూడ జైలులో నరసింహా రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనిశా అధికారుల సోదాల్లో నరసింహా రెడ్డి భారీ ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది. అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయ భూమి, మాదాపూర్​లోని సైబర్ టవర్స్ సమీపంలో రూ.50 కోట్ల ఖరీదైన స్థలం, హఫీజ్​పేట్​లో బహుళ అంతస్తుల భవనంతో పాటు పలుచోట్లా బినామీల పేర్లమీద ఆస్తులున్నట్లు అనిశా అధికారులు గుర్తించారు.

మాదాపూర్​లోని రూ.50 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ స్థలాన్ని నరసింహా రెడ్డి తన బినామీ పేర్లమీద దక్కించుకున్నట్లు అనిశా అధికారుల దర్యాప్తులో తేలింది. అనిశా అధికారులు నర్సింహ రెడ్డిపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి: వైఎస్​ఆర్ సున్నావడ్డీ పథకం నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లో 510 కోట్లు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.