అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని మిడుతూరు వద్ద 44వ జాతీయ రహదారిపై మధ్యప్రదేశ్‌కు చెందిన 122 మంది వలస కూలీలను పోలీసులు అడ్డుకున్నారు. వీరంతా పనుల నిమిత్తం బెంగుళూరుకు వెళ్లారు. లాక్ డౌన్ నేపథ్యంలో...బెంగుళూరులో పనులు లేవు. ఎక్కడికి పోలేని పరిస్థితి ఏర్పడింది. బెంగుళూరు నుంచి రెండు కంటైనర్లలో మధ్యప్రదేశ్‌కి తిరిగి వెళ్తున్నారు. పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానంగా వెళ్తున్న రెండు గూడ్స్ కంటైనర్లని ఆపి చూడగా దాదాపు 122 మంది వలస కూలీలను గుర్తించారు.
డీఎస్పీ శ్రీనివాసులుకు సమాచారం అందించగా.... ఆయన వచ్చి వలస కూలీల వివరాలు తెలుసుకున్నారు. అందరినీ సురక్షితంగా గ్రామాలకు పంపుతామని, ముందు తమకు సహకరించాలని పోలీసులు సూచించారు. అల్పాహారం అందించాక వారిని గేట్స్ కళాశాలలో క్వారంటైన్ కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు.
ఇదీ చదవండి: 'సామాజిక దూరమే మనల్ని కాపాడుతుంది'