అనంతపురం జిల్లా మడకశిర మండల కేంద్రంలో మూడు సంవత్సరాల నుంచి ఒక్క ఆధార్ కేంద్రం కూడా లేకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మడకశిర మండల ప్రజలు కొత్తగా ఆధార్‌కార్డు కోసం నమోదు చేసుకోవాలన్నా.. పేర్లలో మార్పులు చేర్పులు చేయించుకోవాలన్నా తిప్పలు తప్పటం లేదు. ఆధార్‌కార్డులో మార్పుల కోసం మడకశిర నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిబండ మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ప్రయాసపడి గుడిబండకు వెళ్లినా.. 15 రోజుల నుంచి 30 రోజుల గడువు తేదీలతో టోకెన్లు ఇచ్చి, టోకెన్లలో ఉన్న తేదీల్లో తిరిగి రమ్మనటంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలతో 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించటం కష్టంగా ఉందనీ.. ఇప్పటికైనా అధికారులు స్పందించి మడకశిరలో ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: కదిరి ఏటీఎంలో చోరీకి దుండగుల యత్నం