అనంతపురం జిల్లా యాడికి మండలం, నగరూరు గ్రామానికి చెందిన వినోద్ కుమార్ నాయుడు (24), సుచరిత(22)ఇద్దరూ దూరం బంధువులే, అయినప్పటికీ బంధువుల మధ్య పొత్తు కుదరక పోవడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంభీకులు తెలిపిన వివరాల ప్రకారం... పెళ్లి విషయమై ఇరు కుటుంబాలలో తరుచూ గొడవలు జరుగుతుండేవి... నిన్న రాత్రి ఎవరూ లేని సమయంలో మొదట అబ్బాయి విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన బంధువులు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో.... ప్రియుడి మరణవార్త విన్న ప్రియురాలు విషగుళికలు తీసుకుని ఆత్మ హత్యకు చేసుకుంది.
ఇదీ చూడండి నేడు సోన్‌భద్ర బాధితులను కలవనున్న సీఎం యోగి