ETV Bharat / state

AMBULANCE NOT CAME: వైకాపా నేత కాల్​ చేసినా రాని అంబులెన్స్​.. అసలేమైందంటే.. - ఏపీ తాజా వార్తలు

AMBULANCE: అనంతపురం రూరల్ కురుగుంట సమీపంలో ఓ యువకుడు గాయాలపాలయ్యాడు. అదే సమయంలో అటుగా ప్రయాణిస్తున్న ప్రభుత్వ విప్ కాపు రాంచంద్రారెడ్డి కాల్​ చేసినా 108 వాహనం రాకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

AMBULANCE not came
AMBULANCE not came
author img

By

Published : Dec 10, 2021, 2:50 AM IST

AMBULANCE: అనంతపురం రూరల్ కురుగుంట గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని సిమెంటు లోడుతో వెళ్తున్న ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన మహేశ్​ అనే యువకుడు గాయపడ్డాడు. ఆ సమయంలో.. అనంతపురం నుంచి అదే రోడ్డు మార్గంలో రాయదుర్గం వెళ్తున్న ప్రభుత్వ విప్ కాపు రాంచంద్రారెడ్డి గాయపడిన యువకుడిని చూశారు. వెంటనే 108 వాహనానికి మూడు సార్లు తానే ఫోన్ చేసిన అంబులెన్స్ రాకపోవడంతో నిరాశ చెందారు.

ఒక ప్రజా ప్రతినిధి గాయపడిన వ్యక్తి కోసం అంబులెన్స్​కు ఫోన్ చేస్తే రాకపోవడం ఏంటని ఆంబులెన్స్ సిబ్బందిపై ఫోన్లో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సదరు యువకుడిని చివరికి ప్రైవేటు వాహనంలో అక్కడి నుంచి చికిత్స నిమిత్తం తరలించారు.

ఇదీ చదవండి:

Kalava On Jagan Govt: జగన్ ప్రజా దోపిడీ ఆర్థికవేత్తలకు సైతం అంతుపట్టడం లేదు: కాలవ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.