లాక్డౌన్ సడలింపులతో అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలం వద్ద మోపిడి గ్రామానికి చెందిన 500 మంది ఉపాధి కూలీలు పనులు చేపట్టారు. సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి పనులు చేశారు. ఏ గ్రామంలో చూసిన వ్యవసాయ కూలీలు పలుగూ పార చేత పట్టుకుని కూలి పనులు చేసుకుంటున్నారు. 80 రోజులుగా ఇంటి వద్దే ఉంటూ ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడ్డ కూలీలకు చేతి నిండా పనులు దొరకడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి...