ETV Bharat / state

గుంతల రోడ్డు.. దుమ్ము‌, ధూళితో అవస్థలు.. - సీఐటీయూ ధర్నా

గుంతల రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అనంతపురం జిల్లా పెనుకొండలోని ఎన్టీఆర్ కూడలిలో స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. గుంతల రోడ్డు ద్వారా విపరీతమైన దుమ్ము‌, ధూళి వస్తోందని.. దీంతో వృద్ధులు, చిన్న పిల్లలు అనారోగ్య పాలవుతున్నారని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్​ చేశారు.

demand for road work at penukonda ananthapuram
దెబ్బతిన్న రహదారులు, మరమ్మతులు చేపట్టండి
author img

By

Published : Dec 22, 2020, 4:20 PM IST

Updated : Dec 22, 2020, 6:19 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండలోని ఎన్టీఆర్ కూడలి వద్ద గత ఆరు నెలలుగా గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు చేయకపోవడంపై స్థానికులు నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్ని పూర్తిగా గుంతలు ఏర్పడ్డాయి. గుంతల వల్ల విపరీతమైన దుమ్ము‌ వస్తోందని.. దీంతో వృద్ధులు, చిన్న పిల్లలు అనారోగ్య పాలవుతున్నారని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక నివాస గృహాల మహిళలు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పలుమార్లు ఆర్&బి అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని.. సాక్షాత్తు ఆర్&బి మంత్రి ఇదేమార్గంలో వెళ్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్​ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆర్&బి అధికారిని పిలిపించి వారం రోజుల్లో రోడ్డు మరమ్మతు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

ఇదీ చదవండి:

హంద్రీనీవా కాల్వకు గండి.. భారీగా నీటి వృథా

Last Updated : Dec 22, 2020, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.