అనంతపురం జిల్లా కదిరిలో బాహ్యవలయ రహదారి సాధన కోసం ఆందోళనలు చేపట్టిన భారతీయ జనతా పార్టీ నాయకులను స్థానిక కార్యకర్తలు సన్మానించారు. ఈ రహదారి కోసం వంశీకృష్ణ, వెంకటేష్‌లు ఆమరణ దీక్ష చేశారు. ఇటీవలే జాతీయ రహదారి మంజూరైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ నాయకులు రహదారి సాధనకు కృషి చేసిన వారిని సత్కరించారు. నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు.
ఇదీ చదవండి: రెండో రోజూ కొనసాగిన ఆంధ్ర-కర్ణాటక సరిహద్దుల గుర్తింపు