ETV Bharat / state

మద్యం అక్రమ రవాణా.. ఇద్దరు అరెస్టు - liquor illegal transport at anantapuram district news update

కర్ణాటక నుంచి మద్యం ప్యాకెట్లను తీసుకొచ్చి రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల్లో విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు హిందూపురంలో పోలీసులు తనిఖీలు చేశారు. మద్యం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

liquor illegal transport
మద్యం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్టు
author img

By

Published : Oct 19, 2020, 7:44 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం ఏసీబీ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం రవాణా చేస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2400 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి మద్యం ప్యాకెట్లను తీసుకొచ్చి రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల్లో విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేశారు.

చిలమత్తూరు మండలం కొడికొండ చెక్ పోస్ట్ వద్ద ఇద్దరు వ్యక్తుల నుంచి 25 బాక్సుల కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ గోపాల్ తెలిపారు. ఎవరైనా అక్రమంగా మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీ చూడండి:

తండాల్లో వింత శబ్దాలు.. భయభ్రాంతుల్లో ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.