కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఆ ప్రభావం ఆర్టీసీ బస్సులపై పడింది. అనంతపురం జిల్లా కదిరి బస్ డిపో అధికారులు నాలుగో వంతు బస్సులను మాత్రమే నడిపారు. డిపో పరిధిలో రోజూ 110 బస్సులు తిరుగుతుండగా.. ఇవాళ మాత్రం కేవలం 30 బస్సులను మాత్రమే నడిపారు. బస్సు సర్వీసులు తక్కువగా ఉన్న కారణంగా.. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్ స్టాండ్లో ఎక్కువసేపు నిరీక్షించాల్సి వచ్చింది.
ఇదీ చదవండి:
గుంతకల్లు, గుత్తిలో కనిపించని కర్ఫ్యూ... యథావిధిగా వాహనదారుల సంచారం