అనంతపురంలోన గ్రంథాలయ ప్రారంభోత్సవంలో షరీఫ్ ప్రసంగం భారత సైనికులను పొట్టనపెట్టుకున్న పాకిస్థాన్... తగిన మూల్యం చెల్లించుకుటుందని రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ స్పష్టం చేశారు. అనంతపురంలో గ్రంథాలయ ఆడిటోరియం భవనం ప్రారంభానికి హాజరైన షరీఫ్... పుల్వామా ఉగ్రదాడిలో సైనికుల మృతిపై ఆవేదన వ్యక్తంచేశారు. కశ్మీర్... భారత్ లో అంతర్భాగమేనని... ఎన్నేళ్లు పాక్ విధ్వంసం చేసినా అంగుళం స్థలం కూడా తీసుకోలేరని పాకిస్థాన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాక్ ప్రభుత్వం.. పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. అమరజవాన్ల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.