అనంతపురం జిల్లాలో నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వేరుశనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని గుంతకల్లు కార్యాలయం ఎదుట వామపక్ష నాయకులు నిరసన చేపట్టారు. కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో ప్రతి ఏటా వర్షాలు సరైన సమయంలో పడని కారణంగా రైతులు నష్ట పోయేవారని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా జిల్లాలో అధికంగా వర్షపాతం నమోదైన పరిస్థితుల్లో.. రైతులు సాగు చేసిన వేరుశెనగ పంట పూర్తిగా దెబ్బతిందని చెప్పారు.
రైతులకు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారన్న ప్రభుత్వం, నష్టపోయిన వారికి రూ.25వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్ ఉంటుందనే రైతులు అప్పులు చేసి బోర్లు వేసుకుంటే వాటికి మీటర్లు బిగించి ఉచిత విద్యుత్ కాకుండా నగదు బదిలీ అంటూ రైతులను మోసగిస్తున్నారన్నారు.
ఇదీ చదవండి: