ETV Bharat / state

వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ వామపక్ష నాయకుల ధర్నా

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. వామపక్ష పార్టీల నాయకులు ధర్నా చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

author img

By

Published : Feb 18, 2021, 3:48 PM IST

protest on agri laws
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ వామపక్ష నాయకుల ధర్నా

కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అనంతపురంలో వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద రైతు సంఘాలు, సీపీఎం, సీఐటీయూ అనుబంధ సంఘాలతో ధర్నా నిర్వహించారు. భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర చట్టాన్ని అమలు చేయాలని.. కేరళ తరహా రైతు విమోచన చట్టాన్ని అమలు చేయాలన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

'ఎన్నికల్లో ఓటమితోనే తెదేపా నేతలపై వైకాపా దాడులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.