ETV Bharat / state

అనంత జిల్లాలో కొరియన్ విద్యార్థులు...ఏం చేశారంటే..!

అనంతపురం జిల్లా కియా పరిశ్రమ ఆధ్వర్యంలో కొరియన్ విద్యార్థులు 'హ్యాపీ మూవ్' కార్యక్రమం చేపట్టారు. స్థానిక విద్యార్థులతో కలిసి... జిల్లాలోని పెనుకొండ మండలం గుట్టూరు ఆదర్శ పాఠశాల పునరుద్ధరణ పనులు చేశారు.

korean student at anatapur school on social service activity
అనంత పాఠశాలలో కొరియన్ విద్యార్థులు
author img

By

Published : Jan 8, 2020, 10:47 PM IST

అనంత పాఠశాలలో కొరియన్ విద్యార్థులు
అనంతపురం జిల్లా కియా కార్ల తయారీ పరిశ్రమ... సీఎస్​ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాసిబిలిటీ)లో భాగంగా 80 మంది కొరియన్ విద్యార్థులు 'హ్యాపీ మూవ్' కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా గుట్టూరు ఆదర్శ పాఠశాలలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. పాఠశాలలోని మరుగుదొడ్లను బాగుచేయించారు. విద్యార్థులు ఆడుకునేందుకు పలు రకాల పరికరాలు, పాఠశాల ప్రహరీకి మరమ్మత్తులు చేశారు. పాఠశాలలోని పలు భవనాలకు రంగులు వేశారు.

ప్రభుత్వ పాఠశాలలకు మెరుగులు

విద్యార్థులతో చిత్రలేఖనం సాధన చేయించారు కొరియన్ విద్యార్థులు. పది రోజుల పాటు పెనుకొండ మండలంలోని గుట్టూరు, కురుబవాండ్లపల్లి గ్రామాల్లో పాఠశాలల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని 'హ్యాపీ మూవ్' వాలంటీర్లు తెలిపారు. పాఠశాలలో మరమ్మత్తు పనులు జరగడంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి :

పుడమిపై పూసిన రంగవల్లికలు

Intro:ap_atp_57_08_korean_students_happy_move_at_school_avb_ap10099
date:8-1-2020
center:penukonda
contributor:c.a.naresh
cell:9100020922
emp id :ap10099
కొరియన్ విద్యార్థులు హ్యాపీ మూవ్
*పాఠశాలకు మౌలిక వసతుల ఏర్పాటు
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం లోని ఎర్రమంచి లో ఏర్పాటైన కియా కార్ల తయారీ పరిశ్రమ ఆధ్వర్యంలో 80 మంది కొరియన్ విద్యార్థులతో కలిసి హ్యాపీ కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో భాగంగా బుధవారం గుట్టూరులోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా పాఠశాలలోని మరుగుదొడ్లకు రేకులు వేయించారు అదేవిధంగా పాఠశాల విద్యార్థులు ఆడుకునేందుకు పలు రకాల పరికరాలను అమర్చారు. పాఠశాల ప్రహరీ కి మరమ్మతులు చేశారు నూతనంగా ఓ గేటును అమర్చారు .పాడుబడిన మరుగుదొడ్డిని తొలగించారు. పాఠశాలలోని పలు భవనాలకు నూతనంగా రంగులు వేయించారు. కొందరు విద్యార్థులు పాఠశాల విద్యార్థులతో కలిసి చిత్రలేఖనం సాధన చేయించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి పాడుబడిన తమ పాఠశాలలు కియా కార్ల పరిశ్రమ సహకారంతో కొరియన్ విద్యార్థులు అభివృద్ధి చేయడంతో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో 80 మంది కొరియన్ విద్యార్థులు, 16 మంది అనంతపురం లోని జెఎన్టియు యూనివర్సిటీ విద్యార్థులు, నలుగురు ఎఫ్ఎస్ఎల్ ఇండియా సభ్యులు కలసి మొత్తం వందమంది పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. పది రోజుల పాటు పెను కొండ మండలం లోని గుంటూరు, కురుబ వాండ్ల పల్లి గ్రామాల్లోని పాఠశాలల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని అని వారు పేర్కొన్నారు. గురువారం ఉదయం కురుబ వాండ్ల పల్లి పాఠశాలలో అభివృద్ధి పనులు చేపడతామని వారు వివరించారు.
బైట్స్:కొరియన్లు, గుట్టూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం గోవింద్ రెడ్డి

Body:ap_atp_57_08_korean_students_happy_move_at_school_avb_ap10099

Conclusion:ap_atp_57_08_korean_students_happy_move_at_school_avb_ap10099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.