అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలోని కియాపరిశ్రమ ఎదుట నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. పరిశ్రమ కోసం భూములిచ్చిన రైతు కుటుంబాలు ఉద్యోగం ఇవ్వాలంటూ నినాదించారు.ఈ ధర్నాతో వందలాది వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. విషయం తెలుసుకొన్న పోలీసులు పరిశ్రమ అధికారులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించటంతో నిరుద్యోగులు ధర్నా విరమించారు.
ఇదీచూడండి. శ్రీనివాసరెడ్డికి ఇరు రాష్ట్రాల ఆర్టీసీ కార్మికుల నివాళి