అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండడంతో పోలీసులు మద్యం అక్రమ రవాణాపై దృష్టి సారించారు. అనుమానిత ఇళ్లలో సోదాలు నిర్వహించడంలో భాగంగా.. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో గొల్లపల్లి క్రాస్ వద్ద తనిఖీ చేయగా కారు డిక్కీలో 334 కర్ణాటక మద్యం పాకెట్లు పట్టుబడ్డాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడ్ని రిమాండ్కు తరలించారు.
ఇదీ చదవండి: