ETV Bharat / state

రూ.5 లక్షలు విలువైన కర్ణాటక మద్యం పట్టివేత - ananthapuram district newsupdates

హిందూపురంలో కర్ణాటక నుంచి అక్రమగా మద్యం తీసుకొస్తున్న వారి నుంచి రూ. 5 లక్షల విలువ చేసే మద్యం, కారు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్​ఈబీ అధికారులు తెలిపారు.

Karnataka liquor confiscation worth Rs 5 lakh
రూ.5 లక్షలు విలువైన కర్ణాటక మద్యం పట్టివేత
author img

By

Published : Mar 2, 2021, 7:02 AM IST

కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తీసుకొస్తున్న వారిని అనంతపురం జిల్లా హిందూపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5 లక్షలు విలువ చెసే మద్యం, కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొన్నట్లు సెబ్‌ సీఐలు బి.నరసింహులు, శ్రీరామ్‌ తెలిపారు. స్థానిక ఎక్సైజ్‌ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐలు మాట్లాడుతూ.. మొత్తం రెండు కేసులు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు.

చిలమత్తూరు మండలం శెట్టిపల్లి, వీరాపురం ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్న సందర్భంగా మద్యంతో పాటు కారు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకొన్నట్లు వివరించారు. దాడుల్లో ఎస్‌ఐలు ఫణీంద్రనాథ్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, సరోజాదేవి, ఇతర సిబ్బంది పాల్గొన్నట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

పోలీసుల తీరుకు నిరసనగా.. విమానాశ్రయంలో చంద్రబాబు బైఠాయింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.