అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో కర్ణాటక మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆంధ్రాలో అధిక ధరలు ఉండటం వల్ల సరిహద్దు ప్రాంతమైన కర్ణాటక నుంచి మద్యాన్ని అక్రమార్కులు తరలిస్తున్నారు. వీటిపై నిఘా ఉంచిన మడకశిర పోలీసులు శివాపురం ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ మహిళ వద్ద నుంచి 60 కర్ణాటక మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మహిళపై కేసు నమోదు చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు విధిస్తామని ఎస్ఈబీ సీఐ రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి :