అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం శాంతనగర్లో వైఎస్సార్ చేయూత పథకం ద్వారా లబ్ది పొందిన మహిళలు శుక్రవారం సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో మహిళా అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఏటా రూ. 18,750 నగదును అందిస్తామని తెలిపారు.
అనంతరం రాయదుర్గం పట్టణంలోని మోడల్ స్కూల్లో విద్యార్థుల కిట్లను ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పరిశీలించారు. వచ్చే నెలలో పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని చెప్పారు. విద్యార్థులందరికీ పుస్తకాలు, యూనిఫాం, బూట్లు అందిస్తామన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేయడానికి కృషి చేస్తామన్నారు.
ఇదీ చదవండి :