అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని 12 వార్డు ఎర్రనేల వీధిలో వలంటీర్లు పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో వైకాపా వార్డు అభ్యర్థులు పాల్గొని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని తెదేపా అభ్యర్థులు ఆరోపించారు. 12 వార్డు వైకాపా కౌన్సిలర్ అభ్యర్థి భర్త... వలంటీర్లను వెంట పెట్టుకొని ఫించన్లు పంపిణీ చేస్తుండగా.. అడ్డుకోబోగా దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించారని తెదేపా అభ్యర్థి చెప్పారు. ఆ వార్డులో వైకాపా అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
మురికి కూపాల్లోనే జీవన పోరాటం..పారిశుద్ధ్యంపై హామీ ఇస్తేనే ఓటు!