ETV Bharat / state

తప్పిపోయిన మహిళ అప్పగింత - women missing news

మతిస్థిమితం లేని మహిళ బస్టాండ్​లో తప్పిపోయింది. పరిసరాల్లో గాలించిన భర్తకు ఆమె కనిపించలేదు. భార్య ఆచూకీ కోసం ఆయన అనంతపురం జిల్లా కదిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు మహిళ ఆచూకీ గుర్తించారు.

Kadiri police hand over missing wife to husband
తప్పిపోయిన మహిళ అప్పగింత
author img

By

Published : Jan 16, 2021, 1:29 PM IST

అనంతపురం జిల్లా గోరంట్ల మండలం బి.ఎన్ తండాకు చెందిన రైల్వే ఉద్యోగి బిఎన్ఎన్ నాయక్.. గుంతకల్లులో విధులు నిర్వర్తిస్తారు. ఆయన భార్య అలివేలు బాయికి ఆరోగ్యం బాగాలేని కారణంగా తిరుపతికి వెళ్లి వస్తూ కదిరి బస్టాండ్​లో గోరంట్లకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు.

ఆ సమయంలో అతని భార్య తప్పిపోయింది. నాయక్ కదిరి పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. కదిరి పట్టణ సీఐ రామకృష్ణ వెంటనే అప్రమత్తమై ప్రత్యేక బృందాలను, బ్లూకోల్ట్ సిబ్బందిని పంపారు. పట్టణమంతా వెదికి ఆమె ఆచూకీ తెలుసుకుని.. తిరిగి భర్తకు అప్పజెప్పారు. సీఐతో పాటు ఇతర సిబ్బందిని డీఎస్పీ భవ్యకిశోర్ అభినందించారు.

ఇదీ చదవండి:

దారుణం: చిన్నారి మీద పైశాచికత్వం.. ఎవరిదీ పాపం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.