తమకు శత్రువులు తెదేపాలోనే ఉన్నారని ఆ పార్టీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో తమపై వ్యతిరేక పోస్టులు చేస్తుంది కూడా వారేనని ఆయన అన్నారు. అయినా కింది స్థాయిలోని కార్యకర్తల బాగోగులే తమకు ముఖ్యమని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
అనంతపురంలో తెదేపా కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. కార్యకర్తలు లేకుండా ఏ పార్టీ అయినా ఉనికిని కోల్పోతుందని అన్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభించడం కాదని.. వివిధ సమస్యలతో వచ్చే ప్రజలకు సమాధానం చెప్పేలా ఉండాలని జేసీ పవన్‌కు సూచించారు. పేదలకు సాయం చేసే వ్యవస్థను నెలకొల్పేలా పని చేయాలని నాయకులకు, కార్యకర్తలకు చెప్పారు. అంతర్గత వ్యవహారాలు పక్కనబెట్టి పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని కార్యకర్తలను ఆయన కోరారు.
ఇదీ చదవండి: హిందూపురం వైకాపాలో తారాస్థాయికి వర్గ విభేదాలు