అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి తండ్రి విగ్రహ ఏర్పాటుపై.. తెదేపా నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రహదారిపై విగ్రహ ఏర్పాటుకు ఆయనేమన్నా స్వాత్రంత్య్ర సమరయోధుడా? అని నిలదీశారు. ప్రజల కోసం ఒక్కరోజు కూడా పనిచేయని ఎమ్మెల్యే తండ్రి విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు.
జిల్లా కలెక్టర్ తీరుపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాల ఏర్పాటుపై సుప్రీం ఉత్తర్వులను కలెక్టర్ లెక్కచేయలేదని మండిపడ్డారు. విగ్రహం ఏర్పాటుపై 26 సార్లు ఫిర్యాదు చేసినా కలెక్టర్ పట్టించుకోలేదన్నారు. అధికారులు, పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి
మంత్రి మేకపాటి ఉత్తుత్తి ఒప్పందాలను తెదేపా బయటపెట్టింది: లోకేశ్