అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి తాడిపత్రికి బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యంలోని గుత్తి మండలం బాచుపల్లి గ్రామ సమీపంలోని బాట సుంకులమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 'జేసీ ట్రావెల్స్ బస్సులను ఆపడం కాదు... దమ్ముంటే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను తెలంగాణలో తిప్పాలి' అని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అనంతరం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అనుచరులతో కలిసి తాడిపత్రికి వెళ్లారు.