బకాయిలో ఉన్న 11 నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఐపీఓపీ సిబ్బంది ధర్నా చేపట్టారు. కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనులు చేస్తున్నా అధికారులు మాత్రం జీతాలు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
రోజుకు 300 వేతనం ఇవ్వాల్సి ఉండగా... 11 నెలలుగా ఒక్క రూపాయి అయినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు ఇవ్వకుండా ఎలా పని చేయాలని ప్రశ్నించారు. వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో.. అడ్మిషన్ కోసం లైన్లో నిలబడిన కొవిడ్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇదీ చదవండి :