ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు నెలలపాటు ఒప్పంద ప్రాతిపదికన విధులు నిర్వహించడానికి రేపటి నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు అనంతపురం ప్రభుత్వ వైద్యశాల డీఎంహెచ్ఓ కామేశ్వరరావు తెలిపారు. అనంతపురంలోని ఏడీసీసీ బ్యాంకు సమావేశ మందిరంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
కరోనా కేసులు అధికమవుతున్న దృష్ట్యా.. తాడిపత్రి ప్రాంతంలో 500 పడకలతో ఆస్పత్రిని ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతపురం, తాడిపత్రి ప్రాంతాల్లో పని చేయడానికి ఒప్పంద ప్రాతిపదికన 150 మంది డాక్టర్లు, 300 మందికి పైగా సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. వైద్య విద్య అనుభవం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: