అనంతపురం జిల్లా ధర్మవరంలో జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇన్స్పైర్ ట్వంటీ - ట్వంటీ పేరుతో నిర్వహిస్తున్నారు. రెండో రోజు జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు తరలివచ్చారు. మూడు వందలకు పైగా వివిధ రకాల నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు. వాట వల్ల కలిగే ఉపయోగాలు గురించి వివరించారు. వెలుగు చిత్రం, స్మార్ట్ శిరస్త్రాణం, మురుగు ముప్పునకు పరిష్కారం, సోలార్ సైకిల్ తదితర నమూనాలు ఆకట్టుకున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఐఎఫ్ పరిశీలకుడు నవజీత్.. ప్రదర్శనను పర్యవేక్షించారు.
ఇవీ చదవండి: