Inspections At Guntakallu Hospitals : అనంతపురం జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులపై రెవెన్యూ, వైద్య అధికారుల దాడులు నిర్వహించారు. ఏకకాలంలో 15 బృందాలుగా అధికారులు తనిఖీలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఉన్న అన్ని ప్రైవేటు ఆసుపత్రులపై జిల్లా వైద్య, రెవెన్యూ అధికారుల దాడులు చేశారు. అధికారులు 15 బృందాలుగా ఏర్పడారు. అనంతరం ఏకకాలంలో అధికారులు దాదాపుగా అన్ని ప్రవేటు ఆసుపత్రులలో తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో నెలకొన్న పరిస్థితులు రోగులకు అందుతున్న సేవలు, అగ్నిమాపక శాఖ అనుమతి పత్రాలు, ల్యాబ్ నిర్వహణ వంటి అంశాలపై దృష్టి పెట్టారు.
రిజిస్ట్రేషన్ లేకుండా నర్సింగ్ హోమ్‌లు : పలు ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణపై జిల్లా కలెక్టర్‌కు స్పందనలో ఫిర్యాదులు రావడంతో ఈ తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ తనిఖీలలో పలు ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. మరికొన్ని ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండానే నిర్వహిస్తుండడం గమనార్హం. ఇక ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసుపై కూడా నిబంధనల అనుసారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. 15 బృందాల అధికారులు తనిఖీల అనంతరం ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని గుంతకల్ ఆర్డీవో రవీంద్ర వెల్లడించారు.
విశాఖ శ్రీశ్రావణి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో తనిఖీలు
ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం.. లక్షన్నర ఆస్తి నష్టం : పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం మతుకుమల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు అజాగ్రత్తగా పొగ తాగుతుండగా గేదెల పాకాలో మంటలు వ్యాపించాయని, స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు వినుకొండ అగ్ని మాపక సిబ్బంది తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. గేదెలను కట్టేసే పాక అగ్నికి ఆహుతి అవ్వగా, ఆ మంటలకు ఒక గేదెకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు లక్షన్నర వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
మార్కాపురంలో భారీ అగ్ని ప్రమాదం.. కోటి రూపాయల ఆస్తి నష్టం
బావిలో పడి బాలుడు మృతి : కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. 14 సంవత్సరాల బాలుడు ప్రమాదవశాత్తు పొలంలోని బావిలో పడి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే రోహన్, అతని మిత్రుడు ఎద్దులను మేత కోసమని పొలం వద్దకు తోలుకెళ్లారు. ఎద్దులు బావి వైపు వెళ్లడంతో అటుగా వెళ్లిన రోహన్ కాలుజారి బావిలో పడ్డాడు. అక్కడే ఉన్న అతని మిత్రుడు రక్షించే ప్రయత్నం చేసిన సాధ్యపడ లేదు. గ్రామస్థులకు సమాచారం తెలియడంతో హుటాహుటిన తరలి వచ్చి బావిలో పడిన రోహన్‌ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలపడంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు.
Father Killed Son మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కొడుకు తల, మొండెం వేరు చేసిన తండ్రి