జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో... స్వచ్ఛ భారత్కు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం... రైల్వేపై ప్రత్యేక దృష్టి సారించింది. రైల్వేలో ప్లాస్టిక్ నిషేధంతో పాటు స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు చేపట్టి... పరిశుభ్రత నెలకొల్పుతోంది. మహాత్మా గాంధీ 150 జయంతి సందర్భంగా... మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది.
ఇందుకోసం పలు కీలక రైల్వే డివిజన్లలో 150 నర్సరీలను ఏర్పాటు చేసింది. ఒక్క గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో 4 నర్సరీలను ఏర్పాటు చేసింది. ఈ నర్సరీల్లో వందకుపైగా పూలమొక్కలు, పండ్ల మొక్కలను సంరక్షిస్తున్నారు. ప్రస్తుతం గుంతకల్లులో ఏర్పాటు చేసిన నర్సరీ... కనువిందు చేస్తుంది. పచ్చని మొక్కలు అందమైన పుష్పాలతో నర్సరీ ఆహ్లాదాన్ని పంచుతుంది.
గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని పాకాల, రేణిగుంట, నందలూరు, గుంతకల్ స్టేషన్ల పరిధిలో ఈ నర్సరీలను ఏర్పాటు చేశారు. మొక్కలు నాటే ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి... రైలుపై జాతిపిత చిత్రాలను అద్భుతంగా చిత్రీకరించారు. మహాత్ముని 150వ జయంతి సందర్భంగా దీనిని గుంతకల్ రైల్వే డి.ఆర్.ఎం అలోక్ తివారి ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ కోసం రైల్వే శాఖ ఈ కార్యక్రమం చేపట్టడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: