అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైద్యుల పట్ల ఓ వ్యక్తి దురుసుగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ హిందూపురంలో ఇండియన్ మెడికల్ అసోషియేషన్ సభ్యులు నిరసన చేపట్టారు. పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రులను మూసివేసి స్థానిక తహసీల్దారుకు వినతిపత్రాన్ని ఇచ్చారు. వైద్యుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోకుంటే దేశవ్యాప్తంగా ఐఎంఏ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి..