Video: రూ.18 లక్షల విలువైన అక్రమ మద్యం ధ్వంసం - అక్రమ మద్యం ధ్వసం వార్తలు
అనంతపురం జిల్లాలో సుమారు రూ.18 లక్షల విలువైన అక్రమ మద్యం సీసాల్ని పోలీసులు ధ్వంసం చేశారు. డి. హీరేహాళ్ మండలంలో కొద్దిరోజులుగా స్వాధీనం చేసుకున్న 4,860 లీటర్ల కర్ణాటక మద్యాన్ని.. ఎస్పీ పక్కీరప్ప ఆధ్వర్యంలో జేసీబీలతో ధ్వంసం చేశారు.