ETV Bharat / state

రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎస్​ఈబీ అధికారుల తనిఖీలు - prakasam district crime

రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎస్​ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పలువురిపై కేసు నమోదు చేసి ఠాణాకు తరలించారు.

huge wine seized at various places in andhrapradhesh
రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎస్​ఈబీ అధికారుల తనిఖీలు
author img

By

Published : Sep 22, 2020, 10:55 PM IST

అనంతపురం జిల్లాలో...
ఉరవకొండలో ఎస్​ఈబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో నాటుసారా, కర్ణాటక మద్యం పట్టుబడింది. షేక్షనుపల్లి గ్రామంలో నాలుగు లీటర్ల నాటుసారా, డోనేకల్ చెక్​పోస్ట్ వద్ద కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

ప్రకాశం జిల్లాలో...
పుల్లలచెరువు మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహించి... బెల్లం ఊటను ధ్వంసం చేశారు. త్రిపురాంతకం, యర్రగొండపాలెం మండలాల్లో నాటుసారా క్రయ, విక్రయాల గురించి సమాచారం ఇవ్వాలని కోరారు.

తూర్పుగోదావరి జిల్లాలో...
గోవా నుంచి విశాఖపట్నం వైపు అక్రమంగా తరలిస్తున్న రూ.24 లక్షల విలువైన మద్యం సీసాలను అన్నవరం పోలీసులు పట్టుకొన్నారు. రౌతులపూడి మండలం ఎస్.అగ్రహారం వద్ద ఓ లారీ ఆగి ఉండటంతో తనిఖీలు నిర్వహించగా... ఈ మద్యం పట్టుబడింది. ఆరుగురిని అరెస్టు చేసి.. లారీ, స్కార్పియో, బొలేరో వాహనాన్ని సీజ్ చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండీ... శ్రీకాళహస్తిలో అనధికార విగ్రహాలు: నిందితుల అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.