అనంతపురం జిల్లా కదిరిలోని 9వ వార్డులో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు... వార్డు సచివాలయంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కరోనా సంక్షోభం వల్ల పూట గడవడమే కష్టంగా ఉందని... ఇలాంటి పరిస్థితుల్లో తాము ఇల్లు ఎలా కట్టుకుంటామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటిని అప్పగిస్తామని ప్రకటించిన ప్రభుత్వం... ఇప్పుడు మాట మారుస్తోందని ఆరోపించారు.
అయితే.. ప్రభుత్వం 3 ఆప్షన్లను ఇచ్చిందని... తమకు అనుకూలంగా లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉంటుందని సచివాలయ సిబ్బంది వివరించారు. నిబంధన మేరకు బిల్లులు చెల్లిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:
ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహనాలు.. విజయవాడలో ప్రారంభించిన సీఎం