loan apps harrasment: మొబైల్ యాప్ లోన్‌ల కట్టడిపై సీఎంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. అనంతపురంలో ఫోరన్ సిక్ ప్రయోగశాలను తానేటి వనిత ప్రారంభించారు. ఆన్ లైన్ రుణాల రికవరీ ఏజంట్ల వేధింపులకు గురై ఓ కుటుంబంలోని యువతి ఆత్మహత్య చేసుకోవటం బాధాకరమన్నారు. ఈ తరహా యాప్ రుణాలు ఎవరూ తీసుకోవద్దని ప్రజలను కోరారు. క్యాసినో నిర్వహకులకు రాజకీయ పార్టీల నేతలకు సంబంధాలపై ఇప్పుడే నిర్దారణ చేయలేమని దర్యాప్తు కొనసాగుతోందని హోం మంత్రి వనిత పేర్కొన్నారు.
ఇది చదవండి: Hyderabad Casino case: వేగం పుంజుకున్న క్యాసినో కేసు దర్యాప్తు .. మరికొందరికి నోటీసులు