ETV Bharat / state

Home For Birds: పక్షులకు గూళ్లు కట్టేవారున్నారు.. మీకు తెలుసా

author img

By

Published : Jan 14, 2022, 1:30 PM IST

Home For Birds Society: ప్రతి ఒక్కరూ బిజీబిజీగా ఉన్న ఈ రోజుల్లో కూడా పక్షుల కోసం ఆలోచించింది అనంతపురం యూత్​. చెట్టు లేక గూడు కట్టుకునేందుకు పక్షులు అవస్థలు పడుతున్నాయి వారు గ్రహించారు. అందుకే మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. అంతేకాకుండా చెట్లపై పక్షుల కోసం ప్రత్యేకంగా గూళ్లు ఏర్పాటు చేస్తున్నారు హోం ఫర్ బడ్స్ సొసైటీ సభ్యులు.

Home For Birds Society
హోం ఫర్ బడ్స్ సొసైటీ
హోం ఫర్ బడ్స్ సొసైటీ

Home For Birds Society : కొంతకాలం క్రితం గ్రామాల్లో, పట్టణాల్లో పక్షుల కిలకిలారావాలు సందడి చేసేవి. కాలం గడుస్తున్న కొద్దీ వాటి అరుపులు కాదు కదా..పక్షులను చూడటమే గగనంగా మారింది. అందుకు ముఖ్య కారణం..పక్షులకు సరైన గూళ్లు నిర్మించుకోవడానికి ఆవాసాలు లేకపోవడమే. ఈ సంగతి గుర్తించిన అనంతపురం యూత్ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. అంతేకాదు చెట్లపై పక్షుల కోసం ప్రత్యేకంగా గూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం అంతటా 2వేలకుపైగా గూళ్లు అందిస్తూ.. పక్షుల సంరక్షణకై కృషి చేస్తున్నారు, ఈ హోం ఫర్ బడ్స్ సొసైటీ సభ్యులు.

పక్షుల గూళ్లు పట్టుకున్న వీరంతా అనంతపురానికి చెందిన పక్షి ప్రేమికులు. కొన్నాళ్లుగా మెుక్కల పెంపకం, పక్షుల రక్షణ వంటి చర్యలు చేపడుతున్నారు. ఐతే.. ఓ బృందంగా భారీ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టడానికి వీరివద్ద ఆర్థిక స్థోమత లేదు. ఇలాంటి తపన గల యువ శక్తుల కోసం పర్యావరణ ప్రేమికులు అనిల్‌కుమార్‌ ఎదురుచూస్తున్నారు. వీరి గురించి తెలియగానే ఆర్థిక ప్రోత్సాహం అందించేందుకు ముందుకు వచ్చారు. అలా వీరంతా ఓ బృందంగా ఏర్పడి హోం ఫర్‌ బడ్స్‌ సోసైటీ ఏర్పాటు చేశారు.

"ఎండాకాలం వస్తుండటంతో పక్షులు గూళ్లు కట్టుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే మేమే సహజ పద్ధతిలో వాటికి గూళ్లను తయారు చేసి చెట్లకు అమరుస్తున్నాము. మా బృందంలో ఉన్న ఈ యువ సభ్యులంతా ఎంతో అంకిత భావంతో పనిచేస్తారు. కానీ వీరంతా విద్యార్థులు కావడంతో వీరికి సొంత ఆదాయం లేదు. అందుకే నేను నావంతు ఆర్థికంగా సాయం అందిస్తున్నాను. మా సొసైటీ ద్వారా సాధ్యమైనన్ని పక్షులకు గూళ్లను అందించేందుకు కృషి చేస్తున్నాం. " -అనిల్ కుమార్, హోం ఫర్ బడ్స్ సొసైటీ వ్యవస్థాపకులు

ఇదీ చదవండి : Online Betting: ఆన్‌లైన్‌లోకి కోళ్లు, పందేలు.. లైవ్‌లో చూస్తూ బెట్టింగులు

ఈ బృందం... అనంతపురం నగరంలో ఎన్ని జాతుల పక్షులు ఉన్నాయని తొలుత సర్వే నిర్వహించింది. ఆ సమాచారం ఆధారంగా వివిధ విశ్వవిద్యాలయాల్లోని ఆర్నథాలజీ నిపుణులతో మాట్లాడారు. ఏ పక్షి ఎలాంటి గూడు కట్టుకట్టుకుంటుంది, అన్ని పక్షులకు సరిపోయేలా గూళ్లు తయారు చేయడం ఎలా..? వంటివి అడిగి తెలుసుకున్నారు. అధ్యయనం తరువాత... 4 రకాల పక్షి గూళ్లు తయారు చేయిస్తున్నారు...

" పక్షులకు నీటిని, ఆహారాన్ని అందిస్తున్నాం. అలాగే నీడ కూడా ఇవ్వాలనుకున్నాం. కానీ వాటికి గూళ్లు లేక పోవడంతో పావురాలు, డేగలు ఈ చిన్న పక్షులపై దాడి చేస్తున్నాయి. అందుకే అవి నిర్మించుకునే గూళ్ల వంటివే తయారు చేద్దామనుకున్నాం. గూగుల్ లో వెతికి ఈ రకంగా పక్షుల గూళ్లను తయారు చేసే వారి గురించి తెలుసుకున్నాం. ఏ పక్షి ఏరకమైన గూడు నిర్మించుకుంటుందన్న విషయంపై శోధన చేసి పక్షి గూళ్లను కోయంబత్తూరు నుంచి తెప్పించుకుంటున్నాం" -మధురిమ, అనిల్ కుమార్ భార్య

వీరంతా వివిధ కళాశాలల్లో చదువుకుంటూ సెలవు రోజుల్లో, ఖాళీ సమయాల్లో చెట్ల సంరక్షణ కోసం కృషిచేస్తున్నారు. తెల్లవారక ముందు, సాయంత్రం పక్షులు తిరిగి నగరానికి వచ్చే సమయానికి వీధుల్లో సర్వే చేయటానికి వెళతారు. రోజూ ఒక కాలనీని ఎంపిక చేసుకొని పక్షలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయని స్థానికంగా విచారణ చేస్తారు. చెట్లు తక్కువ ఉన్న కాలనీల్లో మొక్కలు నాటటంతోపాటు, ఇంటి యజమానుల్ని ఒప్పించి గృహాల ఆవరణలో పక్షి గూళ్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఇదీ చదవండి : VV Vinayak : 'మర్యాదలైనా.. రుచులైనా.. గోదారోళ్ల ప్రత్యేకతే వేరు'

" మా ప్రాజెక్టులో భాగంగా మొక్కలను నాటుతున్నాం. కేవలం నాటడమే కాదు. వాటిని పరిరక్షించడం మా ప్రాధాన్యం. అలాగే చెట్లపై పక్షులకు గూళ్లను ఏర్పాటు చేసి అంతరించిపోతున్న పక్షుల జాతుల్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాం. " -ఆయేషా, హోం ఫర్ బడ్స్ సొసైటీ సభ్యురాలు

" మా ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం చెట్లను కాపాడటం. దానికి తోడుగా చెట్లపై నివసించే పక్షులను పరిరక్షించడాన్ని మరో ప్రాజెక్టుగా తీసుకున్నాం. పక్షులున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ఇలా మేము తయారు చేసిన గూళ్లను అమరుస్తాము.వాటి కదలికలను గమనిస్తుంటాం. " -సోహెల్, హోం ఫర్ బడ్స్ సొసైటీ సభ్యుడు

ప్రకృతి సిద్ధమైన నార, కొబ్బరి పీచు వంటి వాటితో తమిళనాడులోని కోయంబత్తూర్ లో ఈ గూళ్లు తయారు చేయిస్తున్నారు. కాలనీల్లోని ఇళ్లు, కార్యాలయాలు, పోలీసు స్టేషన్ల ఆవరణలో ఇప్పటికే రెండు వేలకు పైగా పక్షుల గూళ్లు ఏర్పాటు చేశారు..

" మా ఇళ్లకు. ప్రాంతాలకు దగ్గరలో ఉన్న పక్షులకు ఈ విధంగా గూళ్లు అమరుస్తున్నాం. దీని ద్వారా అవి మాకు అలవాటు అవ్వావడమే కాక వాటిని పరిరక్షించడం మాకు సులభమవుతుంది. " -నందకుమార్, హోం ఫర్ బడ్స్ సొసైటీ సభ్యుడు

" పక్షుల వలన ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. ఇళ్ల వద్ద వాటికి ధాన్యాన్ని, నీటిని అందించడం ద్వారా వాటికి సాయమందించివ వారవుతాం. " -దేవ, హోం ఫర్ బడ్స్ సొసైటీ సభ్యుడు

అంతరించిపోతున్న పక్షి జాతుల్ని కాపాడేందుకు కృషి చేస్తున్న ఈ యువ బృందాన్ని స్థానికులు చాలామంది అభినందిస్తున్నారు..

"అంతరించిపోతున్న పక్షి జాతుల్ని కాపాడేందుకు గూళ్లను ఏర్పాటు చేస్తున్న ఈ బృందాన్ని అందరం అభినందించాలి. ఇదే విధంగా అందరూ ముందుకు రావాలని కోరుతున్నాం. " - శ్రీనివాసులు, అనంతపురం డీఎస్పీ

ప్రస్తుతం పక్షులకు గూళ్లు ఏర్పాటు చేస్తున్న ఈ బృందం మరికొద్ది రోజుల్లో ఆహారం అందించే కార్యక్రమానికి కూడా సిద్ధమవుతున్నారు. నీరు ఆహారం ఒకేచోట అందేలా వెదురు బొంగుతో ప్రత్యేక గూడు తయారు చేయాలని భావిస్తున్నారు.

ఇదీ చదవండి : Cheetah At Tirumala: తిరుమల కనుమదారిలో చిరుత సంచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.