అనంతపురం జిల్లా హిందూపురం పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హిందూపురంలోని కొవిడ్ ఆసుపత్రిలో పడకలు పెంచేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ 60 బెడ్లు ఉండగా.. వాటిని 260కు పెంచేలా నిర్ణయించారు. ఇందుకోసం ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న మాతాశిశు వైద్యశాలలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వీటిలో 8 పడకలను అత్యవసర సేవలకోసం, కరోనా వైరస్ బారిన పడిన గర్భిణీల కోసం మరికొన్ని బెడ్లు కేటాయించారు. సాధారణ చికిత్స కోసం ఇంకొన్ని పడకలను అందుబాటులో ఉంచారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని.. స్వచ్ఛందంగా సేవలందించేందుకు వాలంటీర్లు ముందుకు రావాలని కొవిడ్ ప్రత్యేక అధికారి కోరారు. వైరస్ సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మెరుగైన వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఇవీ చదవండి..