అనంతపురం జిల్లా పామిడి పట్టణం 44వ నెంబర్ జాతీయ రహదారిపై భిక్షాటన చేస్తూ.. ఓ హిజ్రా మరణించింది. నగరంలోని అంబేడ్కర్ కూడలిలోని స్పీడ్ బ్రేకర్ వద్ద రామాంజినమ్మ అలియాస్ రామాంజి అనే హిజ్రా.. రహదారులపై.. వచ్చి పోయే వాహనాల డ్రైవర్ల వద్ద భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగించేది.
రోజులానే భిక్షాటన చేస్తున్న సమయంలో ఐచర్ వాహనం అతి వేగంగా వచ్చి ఢీ కొనడం వల్ల తీవ్రంగా గాయపడింది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి...