చిత్తూరు జిల్లా పోలీసులు సుమారు కోటిన్నర రూపాయల విలువైన ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పీలేరు మండలం పొంతల చెరువు క్రాస్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా.. ఓ కంటైనర్లో తరలిస్తున్న 115 ఎర్రచందనం దుంగల్ని గుర్తించారు. తిరుపతి, కడప జిల్లా సంబేపల్లి, తమిళనాడుకు చెందిన 11మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా వేలూరు సమీపంలో కంటైనర్ కోసం వేచి ఉన్న ఇద్దరు తమిళనాడు స్మగ్లర్లను పట్టుకున్నారు. వారి కారును సీజ్ చేశారు. స్వాధీనం చేసుకొన్న ఎర్రచందనం దుంగలతోపాటు వాహనాల విలువ 2 కోట్లు రూపాయల వరకూ ఉంటుందని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు.
ఇదీ చదవండీ.. jobs: ప్రతిభకు తగ్గ ప్యాకేజీ!..డిజిటలీకరణతో ఐటీలో పెరిగిన ఉద్యోగాలు