అనంతలో భారీ వర్షాలు...పొంగుతున్న వాగులు అనంతపురంలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పుట్టపర్తి మండలంలో కురిసిన వర్షాలకు చెరువులు, నీటి కుంటలు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళ చెందుతున్నారు. పుట్టపర్తి మండలంలో గాజులపల్లి చెరువు పూర్తిగా నిండిపోయి దిగువ ప్రాంతాలకు వరద నీరు ప్రవహిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో పొలాలు వరద నీటిలో మునిగిపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొన్నారు. వరద ప్రవాహానికి ఓ ద్విచక్రవాహనం కొట్టుకుపోవటంతో బయటకు తీసేందుకు గ్రామస్తులు శ్రమించారు.
ఇదీ చదవండి : శ్రీవారి దర్శనం ఆరు గంటల పాటు నిలిపివేత