అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసి.. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు నీట మునిగి భారీ నష్టం వాటిల్లింది.
వివిధ మండలాల్లో రాత్రి కురిసిన వర్షపాతం
మండలం | నమోదైన వర్షపాతం(మి.మీలలో) |
రాయదుర్గం | 62.4 |
డీ హిరేహాల్ | 48 |
బొమ్మనహల్ | 43.4 |
గుమ్మగట్ట | 25.8 |
కనేకల్ | 1.6 |
మండలాల్లో చెరువులు వర్షపు నీటితో నిండటంతో జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం కురస్తున్న వర్షాలు ఖరీఫ్ సాగుకు ఆశాజనకంగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: రోడ్డు దాటుతూ వరదలో కొట్టుకుపోయిన యువకుడు