ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చిత్రావతి - Ananthapuram

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కర్ణాటకలో కురిసిన భారీ వర్షానికి అనంతపురం జిల్లాలోని చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

heavy-rains-across-the-state
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు
author img

By

Published : Jul 18, 2021, 9:51 AM IST

Updated : Jul 18, 2021, 2:14 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

ఉపరితల ద్రోణి, ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

అనంతపురం జిల్లా కదిరిలో రాత్రి కుండపోత వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో 26.2సెం.మీ.వర్షపాతం నమోదయింది. వీధులన్నీ చెరువులను తలపించాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. 42 వ నెంబర్ జాతీయ రహదారిపై సైదాపురం, నానా దర్గా వద్ద వర్షపు నీటి ఉద్ధృతి తో వాహన రాకపోకలకు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న కదిరి పట్టణ సీఐ శ్రీనివాసులు సిబ్బంది హిటాచి, జేసీబీ సహాయంతో ఆక్రమణలను తొలగించారు.

కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు చిత్రావతి నది పరవళ్లు తొక్కుతోంది. పుట్టపర్తి సమీపంలో చిత్రావతి డ్యాం నిండిపోయింది. బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తోంది. చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

పుట్టపర్తి నియోజకవర్గంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఓడీ చెరువు మండలంలోని మిట్టపల్లి బ్రిడ్జి కింద తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు పూర్తిగా తెగిపోయి, వాహనాల రాకపోకలు నిలిచిపోయి.

కడపలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కడప కృష్ణ కూడలి మొత్తం నీట మునిగింది. వై జంక్షన్ రోడ్డు, భరత్ నగర్, శ్రీ కృష్ణదేవరాయ కాలనీ, ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, కోర్టు రోడ్డు, అంబేద్కర్ కూడలి, గంజికుంట కాలనీ తదితర ప్రాంతాల్లోకి నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లవారుజాము నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లపై మోకాళ్ల లోతు వరకు నీరు నిల్వ ఉంది. నగరపాలక అధికారులు తక్షణ చర్యలు చేపడుతున్నారు.

గుంటూరులోనూ భారీ వర్షం కురుస్తోంది. ఎన్జీవో కాలనీలో 14.5 సెం.మీ. వర్షపాతం నమోదయింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బండారుపల్లెలో 10.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

ఇదీ చదవండి: గుంటూరు జిల్లాలో భారీ వర్షం.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

Last Updated : Jul 18, 2021, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.