అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దాదాపు రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈ భారీ వర్షం ధాటికి నగరంలోని ప్రధాన రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి.
ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానం నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. తప్పని పరిస్థితుల్లో వర్షం నీటిలోనే రాకపోకలు జరిపారు. పట్టణంలోని శివారు కాలనీలన్నీ జలమయమయ్యాయి.
ఇదీ చదవండి: