అనంతపురం జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఉరవకొండ మండలంలోని శివరామిరెడ్డి కాలనీలోకి వర్షపు నీరు పెద్దఎత్తున ఇళ్ళలోకి చేరింది. రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వలు మారుతున్న తమ బతుకులు మాత్రం మారడం లేదు అని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద వర్షం వచ్చిన ప్రతిసారి మురికి కాలువ పొంగి ఆ నీరు తమ ఇళ్లలోకి వస్తుంది అని, అందులో పాములు, విషాపురుగులు వస్తున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు. మేకల పాక కూలి 6మేకలు చనిపోయాయి. వీటి విలువ సుమారు 30,000 వేలు ఉంటుందని రైతు తెలిపాడు. తమ బాధలను చూసి ప్రభుత్వం తమకు పక్కా ఇల్లు కట్టించాలని స్థానికులు కోరుకుంటున్నారు.
ఇదీ చూడండి
అభివృద్ధికి, స్వచ్ఛతకు కేంద్ర బిందువుగా "గుంతకల్లు రైల్వే జంక్షన్"