అనంతపురంలో కోవిడ్ బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది. తాకిడికి తగ్గట్టుగా ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేకపోవడం.. సమస్య తీవ్రతను పెంచుతోంది. రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలోని సర్వజనాసుపత్రిలో పడకలు నిండిపోయాయి. ఆసుపత్రి ఆవరణలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్డులో పడకలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నవారికి అక్కడే ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి వైద్యం చేస్తున్నారు.
తాత్కాలిక షెడ్డులోనూ బెడ్లు నిండిపోయాయి. ఒక్కో పడకపై ఇద్దరు చొప్పున ఉంచుతున్నారు. కొంతమందికి సకాలంలో పడకలు దొరకని కారణంగా వారికి నేలపైనే చికిత్స అందిస్తున్నారు. సిబ్బంది కొరతతో రోగుల బంధువులే చాలా పనులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో మరిన్ని పడకలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు పెంచాలన్నారు.
ఇవీ చదవండి: