ETV Bharat / state

మా స్థలాలను కొందరు ఆక్రమించారు.. కాపాడండి: దివ్యాంగుల ఆందోళన

అనంతపురం జిల్లా కదిరిలో.. క్రాంతి దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గతంలో ప్రభుత్వం తమకు కేటాయించిన భూములను కొందరు అక్రమార్కులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Handy caped people protest about save lands in kadhiri ananthapuram district
ఇళ్ల స్థలాలను కాపాడాలంటూ దివ్యాంగుల ఆందోళన
author img

By

Published : Jun 16, 2020, 7:55 AM IST

దివ్యాంగులకు కేటాయించిన ఇళ్లస్థలాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కదిరిలో క్రాంతి దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పట్టణంలోని సర్వే నంబర్ 81 లో 80 మంది దివ్యాంగులకు ప్రభుత్వం ఇంటి స్థలాలు మంజూరు చేసిందని వారు తెలిపారు. వీరిలో 18 మంది ఇళ్లు నిర్మించుకున్నారు.

మిగతా వారు ఇళ్లు కట్టుకోలేకపోవడాన్ని అదనుగా చేసుకున్న కొందరు అక్రమార్కులు స్థలాలను ఆక్రమించుకున్నారని బాధితులు వాపోయారు. అధికారులు వెంటనే ఈ విషయంలో అప్రమత్తమై తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవో రామసుబ్బయ్యకు అందజేశారు.

ఇదీ చదవండి:

హోం మంత్రి సుచరితకు కరోనా వైరస్ నిర్థరణ పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.