ETV Bharat / state

'హంద్రీనీవా'కు గండి... పొలాల్లోకి వరద

నిన్న రాత్రి కురిసిన వర్షాలకు హంద్రీనీవా కాలువకు గండి పడింది. సుమారు 100 ఎకరాల్లో భూమి కోతకు గురైందని రైతులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

గండి
author img

By

Published : Aug 18, 2019, 4:59 PM IST

హంద్రీనీవా కాలువకు గండి

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వ్యాసపురం గ్రామ సమీపంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి హంద్రీనీవా ఉపకాలువకు (డిస్ట్రిబ్యూటర్ 2 ) మూడు చోట్ల గండి పడింది. దీనివల్ల దాదాపు 100 క్కూసెక్కులకు పైగా నీరు వృథాగా పొలాల్లోకి వెళ్లింది. 100 ఎకరాలకు పైగా భూమి కోతకు గురైనట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి నెరిమెట్ల, రాయంపల్లి, వ్యాసపురం గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. అప్పటికే ఉపకాలువలో నీరు నిండుగా ప్రవహిస్తోంది. ఆ నీటికి వర్షపు నీరు కూడా తోడవటంతో గండి పడిందని రైతులు అన్నారు. దీనివల్ల తమ భూములు కోతకు గురయ్యాయని, అధికారులు పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

దుర్గంలో భారీ వర్షం... హర్షం లో అన్నదాతలు... ~~~~~~~~~~~~~~* మూడు నెలల నుంచి చినుకు రాలకుండా ఆకాశం వైపు చూస్తూ అన్ని రకాల పూజలు చేస్తున్న అనంత అన్నదాతల గుండెలు కాస్త చల్లబడ్డాయి... ఆదివారం మధ్యాహ్నం నుంచి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో భూగర్భ జలాలు అడుగంటి, రైతులకు పూర్తిస్థాయిలో నీటి మట్టం పడిపోగా కనీసం తాగునీటికి కూడా నానా తంటాలు ఎదుర్కోవలసి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షం అన్ని వర్గాలవారికి కాస్త ఊరట నిచ్చింది.

For All Latest Updates

TAGGED:

watergandi
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.