అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో విషాదం జరిగింది. మల్లిపల్లి గ్రామానికి చెందిన సూర్యనారాయణ విద్యుత్ మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళి.. విద్యుదాఘాతంతో మృతి చెందాడు. సూర్యనారాయణను హుటాహుటిన కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శవాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. సూర్యనారాయణ మృతితో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. కళ్యాణదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
విద్యుదాఘాతంతో దివ్యాంగుడు మృతి - electric shock one man dead news in anantapur
మంచి నీటి కోసం ఏర్పాటు చేసిన మోటార్‌ను ఆన్ చేయటానికి వెళ్లి దివ్యాంగుడు సూర్యనారాయణ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లిపల్లిలో గ్రామంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.