గుట్కా ప్యాకెట్లను ఆటోలో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను తాడిపత్రి పోలీసులు పట్టుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పురు మండలం చీమలవాగుపల్లి గ్రామం వద్ద ఎస్సై గౌస్ మహమ్మద్ బాషా.. సిబ్బందితో వాహనాలు తనిఖీ చేశారు.
పట్టుబడిన ఇద్దరిని అరెస్ట్ చేసి.. వారి నుంచి రూ. 80 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాషా తెలిపారు.
ఇదీ చదవండి: